దుర్వాస మహర్షి మోహన్ బాబు

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో శాకుంతలమ్
తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాత కూడా గుణశేఖర్ నే. ఈరోజే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.

అభిజ్ఞాన శాకుంతలంలో.. శకుంతల పాత్ర ఎంత కీలకమో… దుర్వాస మహర్షి పాత్ర కూడా అంతే కీలకం. ఈ పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. దుర్వాస మహర్షి.. ముక్కోపి. క్షణాల్లో శపించేస్తాడు. ఆ కోపం చెల్లారగానే… శాపానికి విరుగుడూ చెబుతాడు. శకుంతలని శపించి – ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది… దుర్వాస మునే. ఇప్పుడీ.. ఈ పాత్రని రక్తికట్టించేందుకు మోహన్ బాబు రెడీ అవుతున్నారు.
