సన్యాసం స్వీకరించిన ధోని.. పిక్ వైరల్ !
టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సన్యాసం స్వీకరించాడు. దానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మహీ నిజంగానే సన్యాసం స్వీకరించలేదు. ఓ ప్రకటన కోసమే ధోనీని స్టార్‌స్పోర్ట్స్ ఇలా మార్చిందని సమాచారం.
ఇప్పుడు ధోని సన్యాసం పిక్ పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. ”ఓపిక ప్రదర్శించడంలో సన్యాసిలా, ఆటలో యోధుడిలా ఉండడం ధోనీకే చెల్లుతుంది” అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇక ఇప్పటికే ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు. వచ్చే నెలలో ఆరంభమయ్యే ఐపీఎల్-14 కోసం చెన్నైలో ధోని ప్రాక్టీస్ మొదలెట్టిన సంగతి తెలిసిందే.