హరిహర వీరమల్లు : 3 షేడ్స్ లో పవన్

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్  నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇటీవలే ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇది వరకు ఎప్పుడు పవన్ కనిపించని లుక్ లో చూపించారు. లుక్ అదిరిపోయిందని అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడీ.. ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ బయటకొచ్చింది. కథ  ప్రకారం, ఈ సినిమాలో పవన్ కల్యాణ్ 3 షేడ్స్ లో కనిపించబోతున్నాడు.


వీటిలో ఒక గెటప్ మాత్రమే ఫస్ట్ లుక్ లో కనిపించింది. అంటే సినిమాలో మరో 2 డిఫరెంట్ షేడ్స్ ఉండనున్నాయి. మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా. ఈ సినిమాలో  వజ్రాల దొంగ వీరమల్లుగా పవన్ ఓ షేడ్ లో కనిపించబోతున్నాడు. దీంతో పాటు సిక్కు సైనికుల్ని కాపాడే రక్షకుడిగా, దేశం కోసం పోరాడే వీరుడిగా కూడా పవన్ కనిపించబోతున్నాడు.