‘శాకుంతలమ్’ ప్రారంభోత్సవం.. ఫోటోలు !

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో శాకుంతలమ్
తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాత కూడా గుణశేఖర్ నే. ఈరోజే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్స్ వేశారు. దానికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయ్.

అభిజ్ఞాన శాకుంతలంలో.. శకుంతల పాత్ర ఎంత కీలకమో… దుర్వాస మహర్షి పాత్ర కూడా అంతే కీలకం. ఈ పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. దుర్వాస మహర్షి.. ముక్కోపి. క్షణాల్లో శపించేస్తాడు. ఆ కోపం చెల్లారగానే… శాపానికి విరుగుడూ చెబుతాడు. శకుంతలని శపించి – ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది… దుర్వాస మునే.


