వైరల్ : రగడ్ లుక్’లో అల్లు అర్జున్

స్టయిల్ కే స్టయిల్ నేర్పే హీరో అల్లు అర్జున్. అందుకే ఆయన్ని స్టయిలీష్ స్టార్ అని పిలుచుకుంటారు. ఆయన స్టయిల్ ని అంతా పక్కనపెట్టేసి బన్నీ సుకుమార్ సినిమా కోసం ఊరమాస్ లోకి మారిపోయిన సంగతి తెలిసిందే. వీరి కాంబో హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప తెరకెక్కుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ షూటింగ్ గ్యాప్ లో మాత్రం బన్నీ రగడ్ లుక్ లో సందడి చేశారు.


 ‘చావు కబురు చల్లగా సినిమా’ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత శరత్‌ చంద్ర నాయుడు బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ సందడి చేశారు. ఈ పార్టీలో బన్ని ఫొటోలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. క‌ళ్ల‌జోడు పెట్టి, గెడ్డం పెంచేసి కొత్త లుక్‌లో బన్నీ కనిపించాడు. చొక్కా పైగుండీలు తీసి ఎన్న‌డూ లేని విధంగా క‌న‌ప‌డుతూ బ‌ర్త్ డే పార్టీలో హంగామా చేశాడు. ఇప్పుడీ.. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

#alluarjun

Happy birthday Sarath Chandra Naidu annya we always love u anna❤️❣️@Pushpa pic.twitter.com/7CCMeCLsBA— Allu Vamsi (@AlluVamsi15) March 16, 2021