వైరల్ : బూమ్.. బూమ్.. బుమ్రా స్టెప్పులు
టీమిండియా పేసర్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ ఛానెల్ కామెంటరేట్ సంజనా గణేష్ ని పెళ్లాడాడు. పెళ్లి తర్వాత జరిగిన బారత్ లో స్నేహితులతో కలిసి బుమ్రా అదిరిపోయే స్టెప్పులేశాడు. ఇక పెళ్లి రిసెప్షన్ లోనూ భార్య సంజనాతో కలిసి కాలు కదిపాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు బుమ్రా వ్యక్తిగత కారణాలతో టీమ్‌ఇండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. ఈ విషయంపై ఎన్ని వార్తలొచ్చినా టీమ్‌ఇండియా పేసర్ మౌనంగానే ఉన్నాడు. తన పనుల్లో తాను నిమగ్నమయ్యాడు. చివరికి సోమవారం సంజనతో ఒక్కటైన ఫొటోలను స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు.