జన సైనికులని ఖుషి చేసిన థమన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, జన సైనికులకి సంగీత దర్శకుడు థమన్ గుడ్ న్యూస్ చెప్పారు. #KantiPapaKantiPapa సాంగ్ ని రేపు విడుదల చేయబోతున్నామని థమన్ ట్విట్ చేశారు. మా లీడర్ మెరసిపోతున్నారని కామెంట్ పెట్టారు. అయితే.. ఇది జనసేన ప్రమోషనల్ సాంగ్ గా లేక వకీల్ సాబ్ నుంచి వస్తోన్న మరో సాంగ్ గా అన్నది థమన్ క్లారిటీ ఇవ్వలేదు. 


వకీల్ సాబ్ తో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ నుంచి ఒకట్రెండు పాటొలొచ్చాయ్. సూపర్ హిట్ అనిపించుకున్నాయ్. మరోవైపు వకీల్ సాబ్ నేపథ్య సంగీతం పూర్తి చేసే పనిలో థమన్ ఉన్నారు. వచ్చే నెల 9న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానున్నరు. 

So all Set for #KantiPapaKantiPapa TOM !! A VerY lyrical videO coming to ur eyes and ears ❤️ U all Liked our promo ?? 🦋🙌🏿🥁

Our #leader is Soooooo CHARMING 😊💞— thaman S (@MusicThaman) March 16, 2021