క్వాలిటీ ఉంటేనే కాసులు

కరోనా మహమ్మారి వచ్చింది.. కానీ ఇంకా పోలేదు. కరోనా అంటే భయం మాత్రం పోయింది. టాలీవుడ్ ఈజ్ బ్యాక్ అయింది. అంతా నార్మల్ అయింది. ప్రేక్షకులు థియేటర్స్ వస్తున్నారు. సినిమాలు చూస్తున్నారు. సినిమాలని హిట్ చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలని పరిశీలిస్తే.. క్వాలిటీ ఉంటేనే కాసులు రాసులుతున్నాయ్.


క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు సినిమాలు హిట్, బ్లాక్ బస్టర్ జాబితాలోకి చేరాయి. అంటే వాటిలో వున్న కంటెంట్ లేదా క్వాలిటీనే కారణం. యాక్షన్ సీన్లతో క్రాక్, లవ్, ఎమోషన్ కంటెంట్ తో ఉప్పెన, ఫన్ తో జాతిరత్నాలు మాంచి కలెక్షన్ల కళ్ల చూసాయి. రాబోయే సినిమాల్లో చావుకబురుచల్లగా, రంగ్ దే.. తదితర సినిమాల్లోనూ క్వాలిటీ ఉంటేనే కాసులు రాలే అవకాశాలున్నాయ్. లేదంటే మొదటికే మోసం జరగే అవకాశాలున్నాయ్. ఇప్పటికే ఓటీటీలకు ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు. థియేటర్స్ లో రిలీజైన సినిమా రెండు, మూడు వారాల్లో ఎలాగూ ఓటీటీల్లోకి వస్తుంది. అందుకే.. ఇప్పుడు వచ్చే సినిమాల్లో క్వాలిటీనే ముఖ్యం. లేదంటే.. డ్యామేజ్ తప్పదు.