RRRలో అలియా లుక్’పై సటైర్స్ !

ఇది సోషల్ మీడియా యుగం. సినిమాల్లో ఏ లుక్కు, పిక్కూ వచ్చినా పోలికలు పట్టేస్తున్నారు. కాపీ కొడితే ఇట్టే పట్టేస్తున్నారు. తాజాగా ఆర్ ఆర్ ఆర్ లో అలియా భట్ లుక్ పై కూడా నెటిజన్స్ సటైర్స్ వేస్తున్నారు. సోమవారం అలియా పుట్టినరోజు కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ ఆమె లుక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలియా లుక్ బీనా ఆంటీని లుక్ ని పోలీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ బీనా అంటీ ఎవరు అంటే ?  మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూసే ఉంటారు కదా.. అందులో బిజీ అంటీ తెలిసే ఉంటుంది. అలియాని చూస్తుంటే బీనా ఆంటీ గుర్తొస్తుందని కామెంట్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు. ఆయన జంటగా సీత పాత్రలో అలియా భట్ కనిపించనున్నారు. ఆ పాత్రని కట్టు-బొట్టు, పాపడ బిల్లతో డిజైన్ చేశారు. అయితే విగ్గు అలియాకు సరిగ్గా సూటు కాలేదేమో అనిపిస్తుంది. ఆ కట్టు బొట్టు.. విగ్గుని చూసి నెటిజన్స్ అలియాని బీనా అంటీతో పోలిస్తున్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ లో అలియా పాత్ర అద్భుతంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ రషెస్ మెగాస్టార్ చిరంజీవి చూసేశారు. బాహుబలిని మించేలా ఆర్ ఆర్ ఆర్ ఉందని కితాబిచ్చినట్టు సమాచారమ్.