భర్తతో.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న సింగర్ సునీత !

సింగర్ సునీతకు చిన్న వయసులోనే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత భర్తతో విడిపోయింది. చాలాకాలం ఒంటరిగానే ఉంది. పిల్లల భాగోగులు చూసుకుంది. ఇన్నాళ్లకు సునీతకు ఓ తోడు దొరికింది. సునీత ఇటీవల బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ లో జరిగిన ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ప్రస్తుతం సునీత భర్త రామ్ వీరపనేని తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీచ్ లో దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటితో పాటు భర్త రామ్ వీరపనేని బోట్ లో ప్రయాణించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇప్పుడీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఆ ఫోటోల్లో ఈ జంట వయసు ఏమాత్రం కనిపించడం లేదు. 20ల్లోనే పెళ్లి చేసుకొని.. హనీమూన్ వెళ్లిన జంటలా కనిపిస్తున్నారు.

