చంద్రబాబు నివాసంలో ఏం జరుగుతోంది ?

ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేతకు నారా చంద్రబాబు నాయుడు సీఐడీ అధికారులు నోటీసులు అందించడాని.. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో విచారణకు సంబంధించి ఈ నోటీసులు  ఇస్తున్నారని తెలిసింది. ఈ నెల 23న విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా సీఐడీ నోటీసులు అందించనుందని తెలుస్తోంది.


అయితే ఈ ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు.. ఇప్పటి వరకు బయటికి రాలేదు. దాదాపు మూడు గంటల పాటు సీఐడీ అధికారులు చంద్రబాబు ఇంట్లోనే ఉన్నారు. సాధారణంగా నోటీసులు అందజేసి.. రావడానికి 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కానీ సీఐడీ అధికారులు ఇంకా బయటికి రాకపోవడంతో చంద్రబాబు ఇంట్లో ఏం జరుగుతోంది ? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంకా చంద్రబాబు సీఐడీ అధికారులని కలవలేదని తెలుస్తోంది. స్వయంగా నోటీసులు అందించాల్సి ఉండటంతో చంద్రబాబు కోసం సీఐడీ అధికారులు వెయిట్ చేస్తున్నట్టు సమాచారమ్.

చంద్రబాబు  హైదరాబాద్ నివాసంలో సీఐడీ అధికారులు నోటీసులు అందజేస్తున్న నేపథ్యంలో లోకల్ పోలీసులు బంజారాహిల్స్ పోలీసుల అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సీఐడీ అధికారులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నేరుగా బాబు ఇంట్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పుడు.. బంజారాహిల్స్ పోలీసుల అనుమతులు తీసుకొచ్చేందులు.. బాబు నివాసంలోనే వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజా నోటీసులు పాత కేసుకు సంబంధించినది కాదు. ఇది కొత్త కేసులు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ పెట్టిన కేసుకు సంబంధించిన నోటీసులు. దాదాపు 4,070 ఎకరాల భూ వ్యవహారానికి సంబంధించినది తెలుస్తోంది.