మూడో టీ20లో టీమిండియా ఓటమికి అదే కారణం

3వ టీ20లో టీమ్‌ఇండియా చిత్తయింది. ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలిచేసిసింది. 5 మ్యాచుల సిరీసులో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడటానికి ప్రధాన కారణం.. బౌలింగ్ నే. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో అదరగొట్టేశారు. బంతులు ఆగి వస్తుండటంతో భారత బ్యాట్స్ మెన్స్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పరుగులు తీయడం కష్టమైంది.

అయితే అదే పిచ్ పై ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. జోస్‌ బట్లర్‌ (83; 52 బంతుల్లో 5×4, 4×6) విధ్వంసకరంగా చెలరేగిపోయాడు. దీంతో.. 157 పరుగుల లక్ష్యం సునాయసంగా కరిగిపోయింది. ఇక టీమ్‌ఇండియాలో బ్యాటింగ్ లో కోహ్లీ (77: 46 బంతుల్లో 8X4, 4X6) ఆటే హైలైట్‌. పవర్‌ హిట్టింగ్‌తో అలరించాడు. తాను ఆడిన ఆఖరి 17 బంతుల్లో ఏకంగా 49 పరుగులు సాధించాడంటే అతడి హిట్టింగ్‌ను అర్థం చేసుకోవచ్చు. పాండ్యతో కలిసి ఆఖరి 5 ఓవర్లలో అతడు 69 పరుగుల రాబట్టాడు. కేఎల్‌ రాహుల్,  రోహిత్‌ (15), కిషన్‌ (4)  నిరాశపరిచారు.