షాకింగ్ న్యూస్.. సీజనల్ వ్యాధిగా కరోనా !

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని వణికిస్తోంది. కరోనా వెలుగులోకి వచ్చి యేడాది దాడుతున్నా.. దాని విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. మళ్లీ విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి షాకింగ్ న్యూస్ చెప్పింది. కరోనా  వ్యాధిగా మారే అవకాశం ఉందనిఆందోళన వ్యక్తం చేసింది.


వాతావరణ అంశాల ఆధారంగా కరోనా నిబంధనలకు సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచదేశాలకు సూచించింది. కరోనా వ్యాప్తిపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ప్రభావాలపై ఐరాస నిపుణుల బృందం అధ్యయనం చేసింది. దాని ఆధారంగానే ఐరాస ఈ హెచ్చరిక జారీ చేసింది. శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లు తరచూ సీజనల్‌గా మారతాయని ఈ నిపుణుల బృందం వెల్లడించింది. చల్లని, పొడి వాతావరణంలో, తక్కువ స్థాయిలో అతినీలలోహిత కిరణాల ప్రసారం ఉన్నప్పుడు వైరస్ ఎక్కువ కాలం మనుగడ సాగించినట్లు గుర్తించామని తెలిపింది.