అదే పల్లాకు వరంగా మారిందా ?

నల్గొండ – వరంగల్‌ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రౌండ్‌ ముగిసే సరికి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప ప్రత్యర్థి తీన్మార్‌ మల్లన్నపై 3,787 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
తొలి రౌండ్‌లో పల్లాకు 16,130 ఓట్లు రాగా.. తీన్నార్‌ మల్లన్నకు 12,046, కోదండరాంకు 9,080 ఓట్లు, భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి 6,615 ఓట్లు వచ్చాయి.  రెండో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఓట్లు, 15,857, తీన్మార్‌ మల్లన్నకు 12,070, తెజస అభ్యర్థి కోదండరామ్‌కు 9,448, భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 6,669, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 3,244 ఓట్లు పోలయ్యాయి. రెండు రౌండ్లలో కలిపి పల్లా 7వేల పైచిలుకు ఓట్ల మెజారిటీలో ఉన్నారు.


ఈ ట్రెండ్స్ ని చూస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయినట్టు అర్థమవుతోంది. ఉదాహరణకు రెండో రౌండ్‌ ని తీసుకుంటే.. మొత్తం 56వేల ఓట్లలో పల్లాకు 16, 130ఓట్లు వచ్చాయ్. ఆయన తర్వాత స్థానాల్లో నిలిచిన తీన్మార్ మల్లన్న, కోదండరామ్, ప్రేమేందర్ రెడ్డిలకు కలిపి 35వేల పై చిలుకు ఓట్లు వచ్చాయ్. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అదే పల్లాకు వరంగా మారేలా ఉంది. అయితే ఇంకా ఐదు రౌండ్లు లెక్కించాల్సి ఉంది. ప్రస్తుత ట్రెండ్స్ ఇలాగే కొనసాగుతాయా ? అనుహ్యంగా ట్రెండ్స్ లో మార్పు వస్తుందా ? అన్నది వేచి చూడాలి.