విరాటపర్వం టీజర్ టాక్

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి-సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. నందితా దాస్ , ప్రియమణి, ఈశ్వరీరావు, జరీనా వహాబ్, నివేదా పేతురాజ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎల్వీ సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న విరాటపర్వం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా టీజర్ ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఇందులో కామ్రేడ్ రవన్నగా రానా కనిపించనున్నాడు. ఆయన విప్లవ రచనలకు ఆకర్షితురాలైన యువతిగా సాయి పల్లవి కనిపించారు. ఆయన కోసం ఇంటిని వదిలి పోలీసులకు చిక్కినట్టుగా టీజర్ లో చూపించారు. మరోవైపు నక్సలైట్ గా రానా బృందం పోలీసుపై పోరాటాలని టీజర్ లో చూడొచ్చు. రానా బృందంలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా ఉన్నారు. అయితే రానా-సాయిపల్లవి లవ్ స్టోరీ ఎలా మొదలైంది? ఎక్కడివరకు చేరింది ?? అనేది మాత్రం సినిమాలో చూడాల్సిందే.