‘చావుకబురు చల్లగా’ ట్విట్టర్ రివ్యూ

కార్తీకేయ-లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కొత్త దర్శకుడు కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. బన్నీ వాసు నిర్మాత. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయ్. సినిమాపై అంచనాలు పెంచేశాయ్. భారీ అంచనాల మధ్య ‘చావుకబురు చల్లగా’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఇప్పటికే బెనిఫిట్ షోస్ పడిపోయాయ్. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా సినిమా టాక్ ని పంచుకుంటున్నారు.

వైవిధ్యమైన సినిమా అని చెబుతున్నారు. బస్తీ బాలరాజుగా కార్తీకేయ  పాత్రని తీర్చిద్దిన విధానం బాగుంది. ఊరమాస్ గా కనిపిస్తూనే.. కామెడీని పంచారు. భర్త చనిపోయిన లావణ్య త్రిపాఠి వెటపడటం.. సీన్స్ మొదట్లో కాస్త కనెక్ట్ కాలేకపోయినా కథ ముందుకు వెళ్తున్న కొద్దీ.. ప్రేక్షకులని ఆకట్టుకున్నాయ్. పాటలు, మాస్ ఎలిమెంట్స్ బాగున్నాయ్. ఎమోషన్స్ పండాయని చెబుతున్నారు. మొత్తానికి చావుకబురు చల్లగా సినిమాపై పాజిటివ్ టాక్ నడుస్తోంది. పూర్తి రివ్యూ వస్తే సినిమా కంప్లీట్ టాక్ తెలియనుంది.

Mixed Reports for #ChavuKaburuChallaga

Decent Reports for #Mosagallu— TollywoodBoxoffice.IN (@TBO_Updates) March 19, 2021

ShowTime #Chavukaburuchallaga
Death matter is cool@ActorKartikeya @Itslavanya @GA2Official pic.twitter.com/FFMFhiSt2h— Naveen Krishnamraju (@NaveenKRaju22) March 19, 2021