చెల్లని ఓట్ల వెనక.. పెద్ద కుట్ర ?

తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలకు గానూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతోంది. రెండు స్థానాల్లోనూ మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కిం పు అనివార్యం అయింది. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లలో భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయ్.

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోపు నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి సంబంధించి దాదాపు 21వేల పై చిలుకు చెల్లని ఓట్లు నమోదయ్యాయ్. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానానికి సంబంధించి చెల్లని ఓట్ల లెక్క ఈ రేంజ్ లోనే ఉంది. ప్రతి రౌండ్ లోనూ మూడ్నాలుగు వేల చెల్లని ఓట్లు వచ్చాయ్. అయితే దీని వెనక కుట్ర దాగి ఉందని కొందరు పోటీలో నిలిచిన స్వతంత్య్ర అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

చెల్లని ఓట్లన్నీ స్వతంత్య్ర అభ్యర్థులకి పడిన ఓట్లు మాత్రమే వస్తున్నాయ్. అది కూడా ఒకే తరహా ఉంటున్నాయ్. నెంబర్ 1 పక్కన టిక్ మార్క్ లేదా కామా సింబల్ ఉ ంటున్నాయి. అదే తెరాస కు పడిన ఓట్లలో చెల్లని ఓట్లు పడటం లేదు. దీని వెనక ఏదో కుత్ర ఉంది. స్వతంత్రుల ఓట్లని చీల్చే కుట్రలో భాగంగా ఇది చేశారని అనిపిస్తుందని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఓట్ల లెక్కింపు వద్ద సరైన ఏర్పాట్లు లేవు. అసలు అక్కడ ఏంజరుగుతుందో అర్థంకావడం లేదని వాపోతున్నారు.

ఇదిలావుండగా నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి సంబందించి ప్రస్తుతం తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,10,840 ఓట్లు పోలయ్యాయ్. స్వతంత్య్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న 83,29 ఓట్లు పోలయ్యాయ్. తెజస అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్ కు 70,072ఓట్లు పోలయ్యాయ్. ఆ తర్వాత స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 39,107 ఉన్నారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. ఇప్పటికే 34 మంది స్వతంత్య్ర అభ్యర్థులని ఎలిమినేట్ చేశారు. రేపు ఉదయం వరకు తుది ఫలితం వచ్చే అవకాశాలున్నాయి.