కాజల్ ఖాతాలో.. ఒకేరోజు రెండు హిట్స్ !

ఈ శుక్రవారం చందమామ కాజల్ అగర్వాల్ కు బాగా కలిసొచ్చింది. ఆమె నటించిన రెండు సినిమాలు ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చాయ్. వీటిలో ఒకటి సౌత్ నుంచి ప్యాన్ ఇండియా సినిమాగా విడుదల కాగా.. రెండో నార్త్ నుంచి వచ్చింది. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం.

జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు, కాజల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మోసగాళ్లు. ఐటి స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఇందులో కాజల్, మంచు విష్ణు అక్కాతమ్ముళ్లుగా నటించడం విశేషం. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈరోజు విడుదలైంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకొంది. ఇందులో కాజల్ నటన హైలైట్ అని చెప్పుకుంటున్నారు.

ఇక నటించిన బాలీవుడ్ చిత్రం ‘ముంబై సాగా’ కూడా ఈరోజే విడుదలైంది. కాజల్, జాన్ అబ్రహం, హిమ్రాన్ హష్మి, సునీల్ శెట్టి, రోహిత్ రాయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. ఈ చిత్రానికి సంజయ్ గుప్తా దర్శకత్వం వహించారు. టీ-సిరీస్ నిర్మించింది. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. పవర్ ప్యాకెడ్ సినిమా. సినిమా అద్భుతంగా సాగింది. డైలాగ్స్ అదిరిపోయాయ్. సడెన్ గా వచ్చే ట్విస్టులు ప్రేక్షకులని అలరించాయని చెప్పుకొంటున్నారు. ఇందులో కాజల్ జాన్ అబ్రహం కి జంటగా నటించింది.

మోసగాళ్లు, ముంబైసాగాతో సినిమాల హిట్ టాక్ తో ఒకేరోజు.. కాజల్ ఖాతాలో రెండు హిట్స్ పడినట్టయింది. పెళ్లి తర్వాత కాజల్ సినిమాలు విడుదల కావడం ఇదే తొలిసారి. ఇటీవల లైవ్ టెలికాస్ట్ వెబ్ సిరీస్ విడుదలైంది. బాగా ఆడింది. ఇప్పుడు ఏకంగా కాజల్ ఒకేరోజు రెండు శుభవార్తలు విన్నది. ఇది కాజల్, ఆమె ఫ్యాన్స్ కి కూడా డబుల్ ట్రీట్ అన్నమాట. పెళ్లి తర్వాత దూకుడు పెంచడం అంటే.. ఇదేనేమో.. !
#OneWordReview…#MumbaiSaga: POWER-PACKED.
Rating: ⭐️⭐️⭐️½
Action-packed entertainer with powerful dialogue… #JohnAbraham terrific, #EmraanHashmi impactful, #MaheshManjrekar, #AmolGupte superb… First hour razor-sharp, second half good… Mass entertainer! #MumbaiSagaReview pic.twitter.com/Row93qxFQj— taran adarsh (@taran_adarsh) March 18, 2021