రివ్యూ : మోసగాళ్లు

చిత్రం : మోసగాళ్లు (2021)

నటీనటులు : మంచు విష్ణు, కాజల్, సునీల్ శెట్టి తదితరులు

సంగీతం : శ్యామ్ సీఎస్


దర్శకత్వం : జెఫ్రీ గీ చిన్

బ్యానర్ : 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్ టైన్ మెంట్స్

రిలీజ్ డేట్ : 19 మార్చి, 2021.

రొటీన్ కథలకు కాలం చెల్లింది. కొత్త కథలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. అవి చిన్న సినిమాల, పెద్ద సినిమాల అని చూడటం లేదు. బంపర్ హిట్ చేస్తున్నారు. రొటీన్ కథ వచ్చి కోట్ల బడ్జెట్ పెట్టినా.. తిరస్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ.. కొత్తగా ట్రై చేస్తున్నారు. మంచు విష్ణు కూడా అదే చేశారు. ఓ భారీ ఐటీ కుంభకోణాన్ని ఎంచుకొన్నారు. మోసగాళ్లు పేరి పాన్ ఇండియా సినిమా తీసుకొచ్చారు.ప్రచార చిత్రాలతో కట్టుకున్న మోసగాళ్లు.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. మోసాగాళ్లు చేసిన మోసాళ్లు ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకున్నాయ్ ?

కథ :

అను (కాజల్), అర్జున్ వర్మ కవలలు. కటిక పేదరికంలో పెరుగుతున్నారు. దానికి కారణం వీళ్ల తండ్రి తనికెళ్ల భరణి పాటించిన నీతి నిజాయతీలే కారణమని ఫీలవుతున్నారు. తాము మాత్రం మోసాలు చేసైనా భారీగా డబ్బు సంపాదించాలని డిసైడ్ అవుతారు. ఈ క్రమంలో విజయ్ (నవదీప్) తో కలిసి ఓ కాల్ సెంటర్ ని ఏర్పాటు చేస్తారు. ఓ నయా మోసానికి తెరలేపుతారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (అమెరికా ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్) పేరుతో ఫోన్లు చేసి… పన్ను బకాయిలు చెల్లించాలని కోట్లు కొల్లగొడతారు. ఏకంగా 2,600కోట్లు వసూళ్లు చేస్తారు. మరీ కుంభకోణాన్ని అమెరికన్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్, భారత ప్రభుత్వం ఎలా చేధించింది ? వారి నుంచి తప్పించుకోవడానికి మోసగాళ్లు వేసిన పై ఎత్తులు ఏంటీ ? అన్నది మోసగాళ్ల పూర్తి కథ.

ఎలా ఉంది ? 
కైమ్ థ్రిల్లర్స్ ఎప్పుడూ.. ఆసక్తికరంగానే ఉంటాయ్. అయితే కథని రాసుకోవడం ఎంత ముఖ్యమో.. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అంతకన్నా ముఖ్యం. మోసగాళ్లు కథని చాలా బాగా రాసుకున్నారు. కానీ దాన్ని ప్రజెంట్ చేయడంలో కాస్త తడపడ్డారని అనిపించింది. అను, అర్జున్ ల బాల్యంలో పరిస్థితులని చూపించి నేరుగా కథలోకి వెళ్లిన దర్శకుడు సినిమాపై ఆసక్తిని కలిగించారు. అయితే మోసాలకు పాల్పడే ఏపీసోడ్ లో టెక్నికల్ ఎలిమెంట్స్ ని ఇంకా బాగా చూపించాల్సి ఉంది. అదే విధంగా మోసగాళ కోసం సునీల్ శెట్టి దర్యాప్తుని ఇంకా బలంగా చూపించాల్సి ఉంది.

ఎవరెలా చేశారు ? 

ఈ సినిమాకి ప్రధాన బలం కథ. కథ చాలా బాగుంది. మంచు విష్ణు నటన కూడా హైలైట్. చాలా బాగా నటించారు. కాజల్, సునీల్ శెట్టి పాత్రలు బాగున్నాయి. కాజల్ పాత్ర నివిడి ఇంకాస్త పెంచాల్సి ఉంది. తన పాత్రలో కాజల్ నిమగ్నమైపోయింది. సునీల్ శెట్టి బాగా చేశారు. క్లైమాక్స్ సునీల్ శెట్టి – మంచు విష్ణుల మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయ్. నవదీప్, మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు. 

సాంకేతికంగా : 


టెక్నికల్ సినిమా బాగుంది. సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ సినిమా కోసం విష్ణు బాగా ఖర్చు పెట్టారు. తన మార్కెట్ కు మించి రెండింతలు ఖర్చు పెట్టినట్టు సినిమా ప్రమోషన్స్ లో తెలిపారు. కానీ ఆఖర్చుకు ఫలితం తెరమీద కనిపిస్తోంది. సినిమాలో నెమ్మదిగా సాగే సీన్స్ చాలా ఉన్నాయి. వాటికి కత్తెరపెడితే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

  • కథ 
  • మంచు విష్ణు, కాజల్, సునీల్ శెట్టి నటన
  • క్లైమాక్స్ 
    మైనస్ పాయింట్స్ :
  • కథనం
  • ట్విస్టులు
    ఫైనల్ గా : మోసగాళ్లు న్యాయం చేశారు
  • రేటింగ్ : 3/5