తిరుపతిలో తారక్ రాజకీయాలు ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ? అన్నది ఎప్పుడూ హాట్ టాపిక్ నే. ఇటీవలే మీడియా ముందుకొచ్చిన తారక్ పొలిటికల్ ఎంట్రీపై తనదైన శైలిలో స్పందించారు. ఆయన స్పందించడం కూడా హాట్ టాపిక్ అయింది. హెడ్ లైన్స్ లోకి వెళ్లింది. టీవీ ఛానెల్స్, సోషల్ మీడియాలో ఓ వారం పాటు ఈ టాపిక్ కొనసాగింది. నిజంగా తారక్ రాజకీయాల్లోకి రావాలి. అప్పుడే తెదేపా తిరిగి గాడిన పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
అయితే లెటెస్ట్ మూమెంట్ ఏటంటే ? అతి త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలో తారక్ పరోక్షంగా తెదేపాకు ప్లస్ జరిగేలా పావులు కదుపుతున్నట్టు సమాచారమ్. ఇందులో భాగంగానే ఆయన హిట్ చిత్రం ‘అరవింద సమేత’ తిరుపలో స్పెషల్ షో ప్రదర్శిస్తున్నారని చెప్పుకొంటున్నారు. త్రివిక్రమ్-తారక్ కాంబోలో వచ్చిన అరవింద సమేత సినిమా సూపర్ హిట్ అయింది. త్రివిక్రమ్ మాటకు తారక్ యాక్షన్ జతకలిసి.. అదిరిపోయింది.
ఇప్పుడీ.. ఈ సినిమాని తిరుపతి ఈ నెల 21న తిరుపతి జయశ్యాం థియేటర్ లో స్పెషల్ షో ప్రదర్శించనున్నారు. ఇది తిరుపతి ఉప ఎన్నికని దృష్టిలో ఉంచుకొనే ప్లాన్ చేశారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ స్పెషల్ షో వెనక తారక్ ప్రమేయం లేకున్నా.. ఆయన పరోక్షంగా చేయిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఏపీలో తెదేపా అధ్వానంగా మారింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. తెదేపా మళ్లీ ఊపు రావాలంటే.. ఒక్క ఊపు కావాలి. దానికి తిరుపతి ఉప ఎన్నిక వేదిక కావాలని పసుపు తమ్ముళ్లు భావిస్తున్నట్టు సమాచారమ్. ఇందు కోసం తారక్ కూడా ఇలా వాడుకుంటున్నారన్న మాట.