ఐదో T20 : ఇంగ్లాండ్ టార్గెట్ 225
ఇంగ్లాండ్ తో ఆఖరి T20లో టీమిండియా అదరగొడుతోంది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 226 పరుగులు చేసింది. మొదట్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 64 (34 బంతుల్లో, 4ఫోర్లు, 5 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు.
రోహిట్ అవుటైన తర్వాత వన్ డౌన్ లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 32 (17 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్స్) అద్భుతంగా ఆడాడు. సూర్య అవుటైన తర్వాత కెప్టెన్ కోహ్లీ (75, 51 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్స్) గేర్ మార్చాడు. కోహ్లీకి తోడుగా హార్ధిక్ పాండ్యా 39 (4ఫోర్లు, 2సిక్స్) అదరగొట్టేశాడు. ఇంగ్లండ్ బౌలింగ్ స్లో బాల్స్ ని సంధించినా.. ఈ సారి వర్కవుట్ కాలేదు. 225 టార్గెట్ ని ఇంగ్లాండ్ చేధిస్తే.. చరిత్రే. కానీ ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగిన టీమిండియాని ఓడించడం ఇంగ్లాండ్ కి కష్టమేనని చెప్పవచ్చు.