రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగాతున్నాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. కొంతకాలంగా రేషన్‌కార్డులు మంజూరు చేయడం లేదని దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్ ‌రావు అడిగిన ప్రశ్నకు మంత్రి గంగుల సమాధానమిచ్చారు. 

కరోనా వేళ కొత్త కార్డులు జారీ చేయలేదని, రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని త్వరలోనే అర్హులందరికీ అందిస్తామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో సుమారు 2 కోట్ల 79 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయని మంత్రి తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి త్వరలోనే కొత్త రేషన్ కార్డులని జారీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.