ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం !

ఇంగ్లాండ్ తో జరిగిన ఆఖరిదైన ఐదో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 36 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ని 3-2తేడాతో గెలుపొందింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ లో మలాన్ 68, బట్లర్ 52 పరుగులతో రాణించారు.

అయితే బట్లర్ అవుటైన తర్వాత ఇంగీష్ బ్యాట్స్ మెన్స్ పెలివియన్ కి క్యూ కట్టారు. బట్లర్ ని భువనేశ్వర్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో 2/15 బౌలింగ్ నే హైలైట్. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ జోరు మీదున్న టైమ్ లో బట్లర్ (51)ని అవుట్ చేసి బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాతే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది. టీమిండియా బౌలర్లతో శార్థుల్ ఠాకూర్ 3/45, హార్థిక్ పాండ్యా 1/34, నటరాజన్ ఒక వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 226 పరుగులు చేసింది. మొదట్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 64 (34 బంతుల్లో, 4ఫోర్లు, 5 సిక్స్) ఆకాశమే  హద్దుగా చెలరేగి ఆడాడు.  రోహిట్ అవుటైన తర్వాత వన్ డౌన్ లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 32 (17 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్స్) అద్భుతంగా ఆడాడు. సూర్య అవుటైన తర్వాత కెప్టెన్ కోహ్లీ (75, 51 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్స్) గేర్ మార్చాడు. కోహ్లీకి తోడుగా హార్ధిక్ పాండ్యా 39 (4ఫోర్లు, 2సిక్స్) అదరగొట్టేశాడు.