గ్రేట్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ.. రెండు చోట్ల తెరాస గెలుపు !
తెలంగాణలో తెరాస పనైపోయింది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలతో తెరాస ప్రత్యామ్నాయం భాజపానే అనే విషయం అర్థమైంది. ఇకపై తెలంగాణలో వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ తెరాసకు ఓటమి తప్పదు. పట్టభద్రులు తెరాసకు కర్రు కాల్చి వాతపెడతారు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఉద్యోగులు, నిరుద్యోగులెవ్వరూ తెరాసకు ఓటు వేయరనే ప్రచారం జరిగింది. కానీ అంచనాలని తలక్రిందులు చేస్తూ పట్టభద్రులు రెండో చోట్లా తెరాసకు పట్టకట్టారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానం నుంచి తెరాస అభ్యర్థి వాణీదేవి విజయం సాధించారు. ఆమె బీజేపీ అభ్యర్థి రామచంద్రారావుపై గెలుపొందారు. ఇక తగ్గాపోరుగా సాగిన నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. స్వతంత్య్ర అభ్యర్థి తీన్మార్ మల్లనపై పల్లా గెలుపొందారు. దీంతో.. రెండు పట్టభద్రుల స్థానాల నుంచి తెరాస గెలిచినట్టయింది.