సోనుసూద్‌కు అరుదైన గౌరవం

 బాలీవుడ్‌ నటుడు సోనుసూద్‌కు అరుదైన గౌరవం అందించింది. దేశీయ విమానయాన సంస్థ.. స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ ఫొటో వేసింది. లాక్‌డౌన్‌ సమయంలో సోనూసూద్ చేసిన విశేషమైన సేవలకు గౌరవంగా ఈ పని చేసింది. విమానం మీద సోనూసూద్ ఫొటో వేసి.. ‘ఆపద్బాంధవుడు సోనూసూద్‌కు సెల్యూట్‌’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. 


దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి. స్పైస్‌జెట్‌ నుంచి లభించిన ఈ గౌరవం పట్ల సోనూ ఆనందం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నవారికి తాను చేతనైనంత సాయం చేస్తూనే ఉంటానని తెలిపారు. సోనూకు దక్కిన గౌరవం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ కాజల్ ఆనందం వ్యక్తం చేస్తూ ట్విట్ చేసింది.