తెరాస విజయ యాత్ర.. అది బ్రేక్ మాత్రమే !

తెలంగాణలో ఎన్నికలేవైనా.. విజయం మాత్రం తెరాసదే. దుబ్బాక ఉప ఎన్నిక ముందు వరకు ఇదే జరిగింది. తొలిసారి దుబ్బాక ఉప ఎన్నికలో గులాభి పార్టీకి షాక్ తగిలింది. ఆ వెంటనే వచ్చిన గ్రేటర్ ఎన్నికల్లోనూ తెరాసకు ఆశించిన మేర ఫలితాలు రాబట్టలేకపోయింది. దీంతో తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని తెలంగాణ భాజాపా నేతలు చక్కలు గుద్దుకొన్నారు. ఇన్ సైడ్ టాక్ ఏంటంటే.. ? తెలంగాణలో వచ్చేది భాజాపా ప్రభుత్వమేనని ఆ పార్టీ నేతలు డిసైడ్ అయిపోయారట. ఇంకా ముందుకెళ్లి.. మంత్రి పదవులు కూడా అప్పుడే పంచేసుకోవడం మొదలు పెట్టారట. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది వారికి.

అది ఎక్కువై.. పట్టభద్రుల ఎన్నికల్లో వ్యూహాం లేకుండా తెలంగాణ భాజాపా బరిలోకి దిగినట్టుంది. తెరాసపై వ్యతిరేక మొదలైన మాట వాస్తవమే. ఉద్యోగులు, నిరుద్యోగుల్లో అది మరింత ఎక్కువగా ఉన్నది సుస్పష్టం. కానీ వారి ఓట్లన్నీ గంపగుత్తగా భాజాపా వైపు తిప్పుకోవడం విఫలమైంది. తెరాస మాత్రం పక్కాగా ఎన్నికల వ్యూహాంతో ముందుకెళ్లింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయాలా? ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ప్రొఫెసర్ కోదండరామ్ బరిలోకి దిగడం వెనక తెరాస శ్రేణులు పనిచేశాయని ఇన్ సైడ్ టాక్. హైదరాబాద్ కు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుని బరిలో ఉంచింది తెరాసనే అని సమాచారమ్. 

పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపు కోసం తెరాస ఇంత పక్కాగా వ్యూహాలు పన్నితే.. బీజేపీ మాత్రం తెరాసపై ఉద్యోగులు, నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉంది. అదే తమని గెలిపిస్తుందని దర్జాగా ఉన్నారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ నే వారిని ఓడించింది. మొత్తానికి.. తెలంగాణలో తెరాస విజయ యాత్రకు దుబ్బాక ఉప ఎన్నిక బ్రేక్ మాత్రమే. స్మాల్ బ్రేక్ తర్వాత తెలంగాణలో తెరాస విజయయాత్రం కంటిన్యూ అవుతుందని పట్టభద్రుల ఫలితాలు నిరూపించినట్టయింది.