కీర్తి సురేష్ పై నితిన్ కంపైట్.. !

హీరోయిన్ కీర్తి సురేష్ పై నితిన్ కంపైట్ చేశారు. ఈ విషయంలో నితిన్ కి సహకరిస్తామని హైదరాబాద్ పోలీసులు హామీ కూడా ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే ? నితిన్, కీర్తి సురేశ్ జంటగా ‘రంగ్ దే!’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్ ఒక ట్వీట్ చేశారు.

‘కనబడుట లేదు.. డియర్ అను.. నువ్వు ఎక్కడున్నా రంగ్‌దే ప్రమోషన్స్‌లో పాల్గొనాలని మా కోరిక. ఇట్లు నీ అర్జున్’ అంటూ ఆ ట్వీట్‌లో కీర్తి సురేశ్ చిన్ననాటి ఫొటోను పంచుకున్నారు. కాగా.. ఆ ట్వీట్‌కు హైదరాబాద్ సిటీ పోలీస్‌లు స్పందించారు. ‘చింతించకండి నితిన్. మేము జాగ్రత్త తీసుకుంటాం’ అంటూ బదులిచ్చారు. దీనిపై నవ్వుతున్న ఎమోజీలతో మళ్లీ నితిన్ స్పందించారు. పోలీసుల చమత్కారానికి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే.. కీర్తి పై నితిన్ కంప్లైట్ ఇచ్చినట్టే ఉంది. మరీ.. నిజంగా కీర్తి సురేష్ రంగ్ దే ప్రమోషన్స్ లో కనబడటం లేదు. బహుశా.. ఆమెకు పూర్తి స్థాయిలో పారితోషికం అందలేదేమో… !!