త్రివిక్రమ్ వస్తున్నాడు.. ‘రంగ్ దే’ కూడా హిట్టే !

సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. లక్కీ హ్యాండ్స్ కి ప్రాధాన్యత ఇస్తుంటారు. హీరో నితిన్ కి దర్శకుడు త్రివిక్రమ్ ని లక్కీ హ్యాండ్ గా భావిస్తుంటారు. తన సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ కి త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా వస్తే.. ఆ సినిమా హిట్టుకిందే లెక్క అని భావిస్తుంటాడు. నితిన్ ని సెంటిమెంట్ ని కాదనలేక త్రివిక్రమ్ కూడా నితిన్ సినిమాలకి సపోర్ట్ గా నిలుస్తుంటాడు. ప్రమోట్ చేస్తుంటాడు.

నితిన్ తాజా చిత్రం రంగ్ దే. కీర్తి సురేష్ హీరోయిన్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ వారమే (మార్చి 26) రంగ్ దే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం (మార్చి 21) రంగ్ దే ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ వేడుకకి త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాధారణంగా నితిన్ తన సినిమా సినిమాకు ఆయన బాస్ పవన్ కల్యాణ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం పవన్ సినిమాలతో బిజీగా ఉండటంతో.. త్రివిక్రమ్ ని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. మరీ.. త్రివిక్రమ్ వస్తున్నాడుగా.. రంగ్ దే హిట్ అవుతుందేమో చూడాలి.