పవన్ తో సినిమా.. నా కల నెరవేరింది : థమన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో సంగీత దర్శకుడు థమన్ ఒకటి. పవన్ సినిమాకు సంగీతం అందించాలన్నది థమన్ కోరిక. వకీల్ సాబ్ తో థమన్ కోరిక తీరింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ కు థమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ నుంచి ఇప్పటికే వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయ్. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలెట్టింది.


మొదట మ్యూజికల్ ప్రమోషన్స్ ని మొదలెట్టారు. దర్శకుడు వేణు శ్రీరామ్, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, థమన్ కలిసి.. ఓ టీవీ ఛానల్ కి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా థమన్ మాట్లాడుతూ.. ‘పవన్‌ కల్యాణ్‌కి నేను పెద్ద అభిమానిని. మణిశర్మగారి దగ్గర అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ‘ఖుషి’, ‘గుడుంబా శంకర్‌’, ‘బాలు’ చిత్రాలకు పనిచేశాను. ఆయన సినిమాకు సంగీతం అందించడం నా కల. అది ‘వకీల్‌ సాబ్‌’తో నెరవేరినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు.