ఇకపై కోహ్లీ పర్మినెంట్ ఓపెనర్

శనివారం జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టీ20 సిరీస్ ని 3-1 తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఆడటం విశేషం. సచిన్-సెహ్వాగ్ కలిసి ఓపెనింగ్ చేసినట్టుగా క్రికెట్ అభిమానులని అలరించారు. అయితే ఇకపై కూడా రోహిత్ తో కలిసి ఓపెనింగ్ చేస్తానని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ప్రకటించారు.

‘ఐపీఎల్‌లోనూ నేను ఓపెనింగ్‌ చేస్తా. గతంలో వివిధ స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన అనుభవం నాకుంది. అయితే, ఇప్పుడు మాకు బలమైన మిడిల్‌ఆర్డర్‌ ఉందని నమ్ముతాను. ఇకపై రోహిత్‌తో కలిసి కచ్చితంగా ఓపెనింగ్ చేస్తా. మా ఇద్దరిలో ఎవరు నిలిచినా ఇతర బ్యాట్స్‌మెన్‌కు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది జట్టుకు ఎంతో ఉపకరిస్తుంది’ అని కోహ్లీ అన్నారు.

మొదట్లో రోహిత్ (64) దూకుడుగా ఆడితే.. ఆ తర్వాత కోహ్లీ (80) షో చూపించాడు. మధ్యలో సూర్య కుమార్ యాదవ్ (32), హార్థిక్ పాండ్యా (39) మెరుపులు మెరిపించారు. ఫలితంగా ఇంగ్లాండ్ ముందు 225 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది కోహ్లీ సేన. రోహిత్, కోహ్లీ ఇద్దరూ.. తమదైన మార్క్ షాట్స్ తో అలరించారు. 


ఇక 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా మొదట్లో దాటిగానే ఆడింది. మలాన్ (68), బట్లర్ (52) వేగంగా పరుగులు చేశారు. లక్ష్యాన్ని అందుకొనేలా కనిపించారు. అయితే బట్లర్ అవుటైన తర్వాత ఇంగీష్ బ్యాట్స్ మెన్స్ పెలివియన్ కి క్యూ కట్టారు. బట్లర్ ని భువనేశ్వర్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో 2/15 బౌలింగ్ నే హైలైట్. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ జోరు మీదున్న టైమ్ లో బట్లర్ (51)ని అవుట్ చేసి బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాతే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది. టీమిండియా బౌలర్లతో శార్థుల్ ఠాకూర్ 3/45, హార్థిక్ పాండ్యా 1/34, నటరాజన్ ఒక వికెట్ తీసుకున్నారు.