హైదరాబాద్‌లో నల్లా మీటర్ల దరఖాస్తు గడువు పొడిగింపు
హైదరాబాద్ ప్రజలకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. నల్లా మీటర్ల దరఖాస్తులకు ఏప్రిల్ చివరి వరకు గడువు పొడిగిస్తున్నట్లు శాసనమండలిలో ప్రకటించారు. ఉచిత తాగునీటి సరఫరాపై మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. మరో 50 ఏళ్లు దృష్టిలో ఉంచుకొని తాగునీటి వ్యవస్థల ఏర్పాటు చేసినట్లు వివరించారు. నీటి సంరక్షణలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు.
కేంద్రం తీరుపై పరోక్షంగా సటైర్స్ వేశారు కేటీఆర్. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు ఉంటున్నాయని ఆరోపించారు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ ఏర్పాటు విషయంలో కేంద్రంపై విమర్శలు చేశారు. ఇక ప్రశ్నోత్తరాల్లో భాగంగా అసెంబ్లీలో శాసనసభ్యుల ఆసరా పింఛన్లపై లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమాధానం ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఆసరా పింఛన్లు అందజేస్తున్నామని ఎర్రబెల్లి శాసనసభలో వెల్లడించారు.