షాకింగ్ : ఈ సారి హోలీ లేదు.. ఆ మూడ్రోజులు లాక్డౌన్’నే !

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రోజు వారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో సెకండ్ వేవ్ మొదలైందని చెబుతున్నారు. సామాన్యులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు మరోసారి కరోనా బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి దేశంలో ఆంక్షలు విధించేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలు లాక్ డౌన్ పై సమాలోచనలు చేస్తున్నాయి.


ఈ నేపథ్యంలో ఈ సారి హోలీ సెలబ్రేషన్స్ క్యాన్సిల్ కానున్నాయి. ఆ మూడ్రోజులు లాక్ డౌన్ విధించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే హోలీ సందర్భంగా ఈనెల 28, 29, 30 తేదీలలో కఠిన నిబంధనలతో ఆంక్షలు విధించాలనే యోచనలో ఉంది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఉంది. అదే ఆలోచనలో మిగితా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. మొదట దీనిపై ఓ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటే.. మిగితా రాష్ట్రాలు ఆ రాష్ట్రాలని ఫాలో అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. దీంతో.. ఈ సార్ హోలీ సెలబ్రేషన్స్ దాదాపు క్యాన్సిల్ అయినట్టేనని చెబుతున్నారు.