హెచ్చరిక : అలా.. చేయకుంటే మళ్లీ లాక్ డౌన్ తప్పదు

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజు వారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిఅన్ 24 గంటల్లో దేశంలో 46,951 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 212 మంది కరోనాకు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో ఒక్క మహారాష్ట్రల్లోనే 30,535 కొత్త కేసులు నమోదయ్యాయ్.


కరోనా విజృంభణ మళ్లీ మొదవ్వడంతో మరోసారి దేశంలో లాక్ డౌన్ తప్పదేమో అనే చర్చ జరుగుతోంది. అయితే మరోసారి లాక్ డౌన్ కు వెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇటీవల అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ప్రధాని మాట్లాడుతూ… అవసరమైతే మైక్రో లాక్ డౌన్ లు విధించాలని సూచించారు. దీంతో పూర్తి లాక్ డౌన్ విధించే అలోచనలో ప్రధాని లేరని తెలుస్తోంది.

అయితే పరిస్థితి మరింత చేయి దాటితే.. ప్రధాని పూర్తి లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోక తప్పడు. అలా జగరకూడదు అంటే.. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలు. మాస్కులు తప్పక ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. ఆహారం, శుభ్రత విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సమాజాన్ని కాపాడవచ్చు. లేదంటే మాత్రం మరోసారి దేశంలో లాక్ డౌన్ తప్పకపోవచ్చు.