జాతిరత్నాలు.. ఓవర్సీస్ రికార్డ్ !

యుఎస్ లో 1 మిలియన్ మార్క్ అందుకోవడానికి స్టార్ హీరోలు కిందా మీదా పడుతుంటారు. అలాంటిది.. ‘జాతిరత్నాలు’ యుఎస్ లో అదరగొడుతున్నారు. ఈజీగా 1మిలియన్ మార్క్ కి చేరువయ్యారు. ఇవాళో.. రేపో 1మిలియన్ మార్క్ ని అందుకునేలా ఉన్నారు. ఆస్ట్రేలియాలోనూ జాతిరత్నాలు మంచి కలెక్షన్స్ రాబడుతున్నారు. ఒక్క ఆదివారమే అక్కడ రూ. 1.4కోట్లు కలెక్ట్ చేశారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో జాతిరత్నాలు కుమ్మేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రూ.50కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన జాతిరత్నాలు.. ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో రన్ అవుతోంది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో ‘జాతిరత్నాలు’. ‘మహానటి’ తెరకెక్కింది. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. నాగ్ అశ్విన్ నిర్మించారు.