డబ్బింగ్ చెబుతున్న వకీల్ సాబ్

వకీల్ సాబ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రమిది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది చిత్రబృందం. మూడో పాటని రెడీ చేస్తోంది. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా పవన్ డబ్బింగ్ మొదలెట్టారు. దానికి సంబంధించిన ఓ వీడియోని చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అది చూసిన పవన్ ఫ్యాన్స్.. ద పవర్ ఈజ్ లోడింగ్. గర్జించడానికి పవర్ స్టార్ రెడీ అవుతున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక డబ్బింగ్ థియేటర్స్ లో పవన్ సిప్లిసిటీ కనిపిస్తోంది. నిల్చొని ఉన్న దర్శకుడు వేణు శ్రీరామ్ ని పవన్ కూర్చోబెట్టాడు. తాను మాత్రం నిలబడి.. డబ్బింగ్ కార్యక్రమాలని గమనించడం వీడియోలో చూడొచ్చు. ఇక వకీల్ సాబ్ కోసం పవన్ ఫ్యాన్స్, ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాలీవుడ్ హిట్ పింక్ కి రిమేక్ ఇది. బిగ్ బీ అమితాబ్ నటించిన పాత్రలో పవన్ కనిపించనున్నారు. శృతిహాసన్, అంజలి, నివేదా థామస్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. థమన్ అందించిన పాటలు రిలీజ్ కి ముందే రికార్డ్స్ సృష్టిస్తున్నాయ్. ఇక నేపథ్య సంగీతంలో థమన్ మరోసారి మేజిక్ చేస్తాడు. పవన్ పై ఆయనకున్న అభిమానాన్ని సినిమాలో చూపిస్తారని పవన్ ఫ్యాన్ చెప్పుకొంటున్నారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మించారు.

The Power💥 is loading… ⏳#VakeelSaab @PawanKalyan is getting ready to roar🎙🎧 #SriramVenu @shrutihaasan @SVC_official @MusicThaman @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @bayviewprojoffl @BoneyKapoor @adityamusic @SVC_official
#VakeelSaabOnApril9th pic.twitter.com/FIRJeGsAqm— Vamsi Shekar (@UrsVamsiShekar) March 22, 2021