తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 33 శాతం ఫిట్మెంట్ !
తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్. అసెంబ్లీ వేదికగా ఈరోజు సీఎం కేసీఆర్ పీఆర్సీ పెంపుపై ప్రకటన చేయనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రెండోరోజు.. ఈ సభలోనే పీఆర్సీ ప్రకటన చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటిస్తామని తెలిపారు. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక.. ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో పీఆర్సీ ప్రకటన వాయిదా పడవచ్చని భావించారు. అయితే పీఆర్సీ ప్రకటనకు ఆదివారం ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఈరోజు సభలో సీఎం కేసీఆర్ పీఆర్సీపై ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.
ఉద్యోగులు పండగ చేసుకొనేలా పీఆర్సీ పెంపు ఉంటుదని సమాచారమ్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ప్రగతి భవన్లో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమై పీఆర్సీపై చర్చించారు. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మధ్యంతర భృతి కన్నా కనీసం రెండు శాతం ఎక్కువే ఫిట్మెంట్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. దీంతో కనీసం 29 నుంచి 33 శాతం ఫిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. అంతేకాదు. ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై సైతం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు.
ఇక ఈరోజు శాసనసభలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పడంతో.. నిరుద్యోగులని సైతం సీఎం కేసీఆర్ ఖుషి చేస్తారని తెలుస్తోంది. ఉద్యోగాల ప్రకటనపై స్పష్టమైన ప్రకటన చేస్తారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగియగానే నోటిఫికేషన్ వస్తాయని అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటిస్తారని సమాచారమ్. ఇదే జరిగితే..ఒకే రోజు అటు ఉద్యోగులు, ఇటు నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పినట్టు అవుతుంది.