చరణ్ బర్త్ డే కానుకగా ‘వకీల్ సాబ్’ ట్రైలర్

మెగా అభిమానులకు పండగలాంటి న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగ మెగా అభిమానులకి బహుమతులు క్యూ కట్టనున్నాయ్. బర్త్ డే కానుకగా అభిమానులకి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు చరణ్. ఆర్ ఆర్ ఆర్ నుంచి అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్) స్పెషల్ పోస్టర్ రానుంది. #RC15 అప్ డేట్ కూడా చరణ్ బర్త్ డే కానుకగా ఇవ్వనున్నారు. శంకర్-రామ్ చరణ్-దిల్ రాజు కాంబోలో తెరకెక్కనున్న చిత్రమిది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. ఇక ఆచార్యలో చరణ్ ఫస్ట్ లుక్ కూడా 27న రానుంది. 


ఈ మూడు గిఫ్ట్ లు మాత్రమే కాదు. అబ్బాయ్ బర్త్ డే కానుకగా బాబాయ్ పవన్ కల్యాణ్ మెగా అభిమానులకి అదిరిపోయే బహుమతి ఇవ్వనున్నారు. వకీల్ సాబ్ టీజర్ ని విడుదల చేయనున్నారని సమాచారమ్. అదే నిజమైతే.. ఈ నెల 27న మెగా అభిమానులకి పండగే పండగ. ఇక ఏప్రిల్ 3న వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరనుంది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారని తెలిసింది. మొత్తానికి.. రాబోయే రెండు వారాలు మెగా అభిమానులకి పండగే.