తలైవి ట్రైలర్.. అదిరిపోయింది !

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయ‌ల‌లిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా నటిస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకుడు. 

ఏప్రిల్ 23న తలైవి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. హీరోయిన్ గా జయలిలత క్రేజ్ నుంచి మొదలుకొని.. ఆమె పొలిటికల్ ఎంట్రీ.. ఆమె తెగువ, తెగింపు, ఆమెకు జరిగిన అనుమానాలని, వాటిపై ఆమె స్పందించిన తీరుపై బిట్స్ సీన్స్ ని కట్ చేస్తూ.. ట్రైలర్ ని కట్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే సింగిల్ ట్రైలర్ లోనే సినిమా చూపించారు. 

మాహాభారతంకి రెండో పేరు జయ అని ట్రైలర్ లో కంగనా చెప్పడం ఆకట్టుకుంది. రొమాన్స్, రెవెల్యుషన్ హీరో,  రెబల్, ఐకాన్ .. అంటూ జయ జీవితంలోని కీలక ఘట్టాలని ట్రైలర్ చూపించేశారు. ట్రైలర్ అదిరిపోయింది. సినిమాపై అంచాలని పెంచేలా ట్రైలర్ ఉంది.