అవసరమైతే తప్ప బయటికి రాకండి.. ఈటెల విజ్ఝప్తి !

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజూవారీగా నమోదవుతున్న కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 412 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో ముగ్గురు కరోనాతో మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1674కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,151 ఉండగా.. వీరిలో 1,285 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు కరోనాపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సోమవారం మంత్రి ఈటెల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి పక్కాగా చర్యలు తీసుకోవాలని, రోజుకు 50వేల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ‘కొవిడ్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు’ అని ఈటెల ప్రజలను కోరారు.