‘శ్యామ్‌ సింగరాయ్’ మరో హీరో ఎవరో తెలిసిపోయిందోచ్ !

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో ఒకటి టక్ జగదీష్ కాగా.. రెండోది శ్యామ్ సింగరాయ్. ఇప్పటికే టక్ జగదీష్ చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాని శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో నానితో పాటు మరో హీరో కనిపించనున్నారు. ఆ హీరో ఎవరు ? అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.

ఆయనెవరో కాదు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌. ఇందులో ఆయన సహాయక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని తానే ట్విటర్ వేదికగా తెలియజేశారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ నాయికలుగా నటిస్తున్నారు. మిక్కీ జె. మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్నచిత్రమిది. కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది.