రుణ మారటోరియంపై సుప్రీం కీలక తీర్పు
కొవిడ్ మహ్మమారిని దృష్టిలో పెట్టుకుని మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని, మారటోరియంను పొడిగించాలని దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీం ఈ తీర్పు వెలువరించింది. ఆర్థిక ప్యాకేజీలు, ఉద్దీపనలు ప్రకటించాలని ప్రభుత్వానికి, రిజర్వ్‌బ్యాంకుకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం స్పష్టం చేసింది. అలాగే ఇప్పటికే రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని కేంద్రం మాఫీ చేసిందని కోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది.
చక్రవడ్డీ మాఫీ రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలకు పరిమితం చేయడంలో హేతుబద్ధత లేదన్న సుప్రీంకోర్టు.. రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న రుణాలపై కూడా చక్రవడ్డీని మాఫీ చేయాలని ఆదేశించింది. అయితే మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయమని చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది.