రౌడీయిజం చెయ్యాలంటే దమ్ము కావాలి అంటోన్న సంపూ !

బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు యాక్షన్ లోకి దిగిపోయాడు. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘బజార్‌రౌడి’. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షాయాజీ షిండే, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

తాజాగా ‘బజార్‌ రౌడి’ టీజర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం నవ్వులు పూయించేలా టీజర్ ని కట్ చేశారు. ‘రౌడీయిజం చెయ్యాలంటే జీపు.. జీపులో పెట్రోలు.. దానిలో రౌడీలు కాదురా.. దమ్ము కావాలి’. ‘అద్భుతం, అమోఘం… మీ కూతుళ్ల కోపరేషన్, మీ ఆపరేషన్.. అదిరిపోయింది’ అంటూ సంపూ చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయ్. ఫన్ రైడ్ గా ‘బజార్‌ రౌడి’ ఉండనుందని టీజర్ తో హింట్ ఇచ్చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.