కరోనా సెకండ్ వేవ్.. ఏప్రిల్ లో మరీ డేంజర్ !
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ కరోనా సెకండ్ వేవ్ ప్రవేశించిందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజా నివేదికలో షాకింగ్ విషయాలు చెప్పింది.
‘సెకండ్ వేవ్ ఫిబ్రవరి 15 నుంచి 100 రోజులు ఉండనుంది. దీంతో రానున్న ఏప్రిల్ మధ్య నాటికి దేశవ్యాప్తంగా వైరస్ తీవ్రరూపం దాల్చనుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది సెకండ్ వేవ్‌లో వైరస్ బారిన పడే అవకాశం ఉంది’ అని అంచనా వేసింది.
మరోవైపు దేశంలో రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 50వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయ్. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి కఠినమైన ఆంక్షలు విధించేందుకు రెడీ అవుతున్నాయి.