‘రంగ్ దే’ ఓవర్సీస్ రివ్యూ
వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్-కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. సితారలో నితిన్ నటించిన మూడో సినిమా ఇది. నితిన్ నటించిన అఆ, భీష్మ చిత్రాలని సితార నిర్మించింది. ఆ రెండు సూపర్ హిట్ అయ్యాయ్. రంగ్ దే కూడా హిట్ గ్యారెంటీ అని ప్రచార చిత్రాలని చూస్తే అనిపించింది.
టీజర్, ట్రైలర్ అదిరిపోయాయ్. ఫన్ రైడ్ గా ‘రంగ్ దే’ ఉండబోతుందని ట్రైలర్ తో క్లారిటీ వచ్చేంది. భారీ అంచనాల మధ్య రంగ్ దే రేపు (మార్చి 26) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఓవర్సీస్ లో అప్పుడే రంగ్ దే షోస్ పడిపోయాయ్. సినిమా టాక్ బయటికొచ్చింది. రంగ్ దే సూపర్ హిట్ ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి వన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. కావాల్సినంత వినోదం పంచారని.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినోదం నాన్ స్టాప్ గా సాగిందని కామెంట్స్ పెడుతున్నారు.
నితిన్-కీర్తి సురేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్. నితిన్ నుంచి ఇలాంటి ఫైన్ రైడ్ సినిమాలొచ్చాయ్. కానీ కీర్తి సురేష్ తొలిసారి ఇలాంటి సినిమాలో మెరవడం.. ఆమె కామెడీ టైమింగ్ హైలైట్ అని చెబుతున్నారు. సినిమా సరదాగా సాగినా.. రెండో భాగంగా ఎమోషన్స్ టచ్ చేసింది. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులని ఆకట్టుకునేలా రంగ్ దే ఉందని చెబుతున్నారు. దేవి అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయని కామెంట్స్ పెడుతున్నారు. ఓవర్సీస్ లో పాజిటివ్ టాక్ రావడంపై దర్శకుడు వెంకీ అట్లూరి ఆనందం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఓవర్సీస్ ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పారు.
Usa and Australia premieres are going to rock. Getting positive vibes. And fast-filling seats. Thank you overseas audience❤️ #RangDeOnMarch26 pic.twitter.com/sVLIgUUb9u— Atluri Venky (@dirvenky_atluri) March 25, 2021