ముద్దుగా రెడీ అయిన రస్మిక

రష్మిక మందన – ఇప్పటికే టాలీవుడ్ ని దున్నేస్తోంది. వరుసగా స్టార్ హీరోల పక్కన నటిస్తోంది. గత యేడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో విజయాలు అందుకున్న రస్మిక.. ఈ యేడాది పుష్ప సినిమాలో నటిస్తోంది. త్రివిక్రమ్-తారక్ సినిమాలోనూ రస్మికనే హీరోయిన్ గా ఎంపికైంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు, కోలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తోంది. కార్తీకి జంటగా సుల్తాన్ సినిమాలో నటిస్తోంది.

బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుక రస్మిక ముద్దుగా రెడీ అయి వచ్చింది. చీర కట్టుకొని.. నెత్తిలో గులాభి పూవు పెట్టుకొని ముద్దుగా ముస్తాబైంది. క్యూట్ గా కనిపించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ లోకి ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు రస్మిక-విజయ్ దేవరకొండల మధ్య ఏదో సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బుధవారం రాత్రి ముంబైలో విజయ్-రస్మిక పార్టీలో పాల్గొన్నారు. లైగర్ చిత్రబృందం చేసుకున్న పార్టీ అని తెలుస్తోంది. దీంతో రస్మిక-విజయ్ ల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయింది.