అల్లూరి ఉగ్రరూపం.. చూశారా ?

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రమిది. ఇందులో కొమరంభీమ్ పాత్రలో తారక్.. ఆయనకి జంటగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో నటిస్తున్నారు.

రామ్ చరణ్ బర్త్ డే కానుకగా తాజాగా అల్లూరి సీతారామరాజు కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో విల్లుని ఆకాశం వైపు ఎక్కుపెట్టి.. అల్లూరి గర్జిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అల్లూరి ఉగ్రరూపం చూపించారు. స్వాత్రంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల మధ్య గల ఓ కామన్ పాయింట్ ఆధారంగా దర్శకుడు రాజమౌళి ఈ కథని రాసుకొన్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.