రివ్యూ : అరణ్య

చిత్రం : అరణ్య (2021)
నటీనటులు : రానా, విష్ణు విశాల్‌, పులకిత్‌ సామ్రాట్‌, జోయా హుస్సేన్‌ తదితరులు
సంగీతం : శంతన్‌ మొయిత్రా
దర్శకత్వం : ప్రభు సాల్మన్
బ్యానర్ ‌: ఏరోస్‌ ఇంటర్నేషనల్‌
రిలీజ్ డేట్ : మార్చి 26, 2021.

రానా దగ్గుబాటి – సినీ పరిశ్రమలో హద్దులు పెట్టుకోని నటుడు. ఎక్కడ మంచి కథ అనిపించినా… అక్కడి వెళ్తాడు. ఆ పాత్రలో లీనమవుతాడు. ఆ కథకి ప్రాణం పోస్తాడు. అక్కడి ప్రేక్షకులని మెప్పిస్తాడు. అందుకే రానాకి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. బాలీవుడ్ అయినా ఒక్కటే. ఆయన సినిమాలో కథే హీరో. అందుకే ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. రానా అడవి మనిషిగా మారి చేసిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్ దర్శకుడు. విశాల్‌, పులకిత్‌ సామ్రాట్‌, జోయా హుస్సేన్‌ కీలక పాత్రల్లో నటించారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన అరణ్య భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. ఆ అంచనాలని అందుకుందా ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :  
న‌రేంద్ర ‌భూప‌తి (రానా) త‌ర‌త‌రాలుగా ఏనుగుల్ని ర‌క్షించే ఓ  కుటుంబంలో పుట్టి పెరుగుతాడు. విశాఖ స‌మీపంలోని చిల‌క‌ల‌కోన అడ‌విలో ఏనుగుల సంరక్షణని చూస్తుంటాడు. అడ‌వి, ఏనుగుల ర‌క్ష‌ణ కోసం పాటు ప‌డుతున్నందుకు ఫారెస్ట్ మేన్‌గా రాష్ట్రప‌తి పుర‌స్కారం కూడా అందుతుంది. అయితే కేంద్ర‌మంత్రి క‌న‌క‌మేడ‌ల రాజ‌గోపాలం (అనంత్ మ‌హ‌దేవ‌న్‌) చిల‌క‌ల‌కోన అడ‌విపై క‌న్నేస్తాడు. అక్క‌డ డీ.ఎల్‌.ఆర్ టౌన్‌షిప్ క‌ట్టేందుకు రంగంలోకి దిగుతాడు. మ‌రి అడ‌వినే న‌మ్ముకున్న ఏనుగులు, అర‌ణ్య…  కేంద్ర‌మంత్రిపై ఎలా పోరాటం చేశారు?  అడ‌విని ఎలా ద‌క్కించుకున్నార‌నేది.. పూర్తి కథ.

విశ్లేషణ :
అడ‌వులు… ఏనుగుల సంర‌క్ష‌ణ ఆవ‌శ్య‌క‌తని చాటి చెప్పే  క‌థ ఇది. గతంలో ఇలాంటి సినిమాలు వచ్చినా.. ఇప్పుడు ఇలాంటి కథని ఎంచుకోవడం సాహసమే. కానీ సాల్మన్ ప్రభు సినిమాని గొప్పగా తీశాడు. ముఖ్యంగా అర‌ణ్య‌కీ, ఏనుగులకీ మ‌ధ్య అనుబంధాన్ని  తెర‌పై ఆవిష్క‌రించిన  తీరు…  ఆ కోణంలో  భావోద్వేగాల్ని రాబ‌ట్టిన విధానం అద్భుతం. తొలి స‌న్నివేశం నుంచే అర‌ణ్య ప్ర‌పంచంలో ప్రేక్ష‌కుడిని భాగం చేశాడు ద‌ర్శ‌కుడు. అభివృద్ధి, ఉపాధి  పేరుతో  అడ‌వుల్ని నాశ‌నం చేస్తున్న విధానాన్ని క‌ళ్ల‌కు క‌ట్టే  ప్ర‌య‌త్నం చేశారు. 

రొటీన్ సినిమాలకు ఇది భిన్నం. విభిన్నమైన సినిమాలు చేసినప్పుడు చిన్న చిన్న మైనస్ లని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అరణ్య కథ నేపథ్యం చాలా బాగుంది. కథనం కూడా ఆకట్టుకుంటోంది. కానీ తర్వాత ఏం జరుగబోతుంది ? అన్నది ప్రేక్షకుడు ముందే ఊహించవచ్చు. అయినా.. ప్రేక్షకుడు ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. అక్కడ కొద్దిసేపు ఉండేలా చేశాడు. అవతార్ సినిమా చూసినంత సేపు మనం కూడా ఆ లోకంలోనే ఉన్నామేమో అనే భ్రమ కలుగుతుంది. అరణ్య అంతే. టెక్నికల్ గా సినిమా బాగుంది. చివ‌రి 30 నిమిషాలు పండిన  భావోద్వేగాలు సినిమాని మ‌రోస్థాయికి తీసుకెళ్లాయి.

అర‌ణ్య పాత్ర‌లో రానా జీవించారు.  అడ‌వి మ‌నిషిగా.. హావ‌భావాలు, సంభాష‌ణ‌లు ప‌లికిన తీరు అద్భుతం. రానా త‌ప్ప మ‌రొక‌రు చేయ‌లేరనిపించేలా నటించారు. విష్ణు విశాల్, జోయాతో బాగా నటించారు. కానీ వీరి పాత్రలో అంతర్థంగా కనుమరుగు అయిపోవడం బాలేదు. కేంద్ర‌మంత్రిగా అనంత్ మ‌హ‌దేవ‌న్ బాగా చేశారు. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా : 
టెక్నికల్ గా సినిమా బాగుంది. అశోక్‌కుమార్ కెమెరా అడ‌వి అందాల్ని అద్భుతంగా చూపించింది. ద‌ట్ట‌మైన అడ‌వుల్ని తెర‌పై చూపించిన తీరు చాలా బాగుంది. శంత‌ను మొయిత్రా సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయ్. సంభాషణలు బాగున్నాయి. ఎడిగింగ్ ఓకే. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

  • కథ
  • దర్శకత్వం
  • రానా నటన
  • సినిమాటోగ్రఫీ
  • సంభాషణలు
  • మైనస్ పాయింట్స్ :
  • అక్కడక్కడ స్లో నేరేషన్
  • ఊహకు తగ్గట్టుగా సాగే సీన్స్
    ఫైనల్ గా : విభిన్న సినిమాలని ఆస్వాదించే వారికి ‘అరణ్య’ అద్భుతమైన సినిమా అనిపిస్తోంది

రేటింగ్ : 3/5
నోట్ : ఇది సమీక్షకుడికి వ్యతిగత అభిప్రాయం మాత్రమే.