రెండో వన్డే : ఇంగ్లాండ్ టార్గెట్ 337
ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డే లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. కె ఎల్ రాహుల్ (108 114బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్ లు) సెంచరీతో రాణించారు. కెప్టెన్ కోహ్లీ (66 79 బంతుల్లో, 3ఫోర్లు, 1సిక్స్), రిషబ్ పంత్ (77, 40బంతుల్లో, 3ఫోర్లు, 7సిక్స్ లు) హాఫ్ సెంచరీలు చేశారు. ఆఖర్లో హార్థిక్ పాండ్యా 35 (16 బంతుల్లో 1ఫోర్, 4 సిక్సులు) రెచ్చిపోయాడారు. ఫలితంగా ఇంగ్లాండ్ ముందు 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో టోప్లే, టామ్ కరణ్ 2 వికెట్లు, సామ్ కరణ్, రషీద్ చెరో వికెట్ తీసుకున్నారు. మూడు వన్ డే సిరీస్ లో తొలి వన్ డే ని టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లోనూ గెలిచి.. సిరీస్ కైవసం చేసుకోవాలనే కసితో టీమిండియా ఆడుతోంది. మరోవైపు.. ఈ మ్యాచ్ లో గెలిచి.. సిరీస్ (1-1) సమం చేయాలని ఇంగ్లాండ్ ఆశపడుతోంది. అయితే టీమిండియా నిర్దేశించిన 337 భారీ లక్ష్యాన్ని చేధించడం అంతా ఈజీ మాత్రం కాదు. మరీ.. ఇంగ్లీశ్ బ్యాట్స్ మెన్స్ ఏ మేరకు పోరాడుతారు ? అన్నది చూడాలి.