రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ సాంగ్.. అదిరిపోయింది !

రేపు (మార్చి 27) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులకి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు చరణ్. #RRR నుంచి అల్లూరి సీతారామరాజు (చరణ్) స్పెషల్ పోస్టర్ రానుంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 30 నిమిషాల పాటు సిద్ధ పాత్ర ఉండనుంది. ఆ పాత్రని చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడట కొరటాల. చరణ్ బర్త్ డే కానుకగా సిద్ధ ఫస్ట్ లుక్ రానుంది.


ఇక #RRR తర్వాత గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్ డేట్ కూడా రేపు రానుంది. సినిమా టైటిల్, హీరోయిన్ ఇతర వివరాలని తెలియజేసే అవకాశాలున్నాయి. అయితే చరణ్ బర్త్ డే గిఫ్ట్స్ అందించడానికి ముందే ఫ్యాన్స్ నుంచి చరణ్ కి గిఫ్ట్ అందింది. రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ సాంగ్ ఒకటి తాజాగా విడుదల చేశారు. ఇందులో చరణ్ మొదటి సినిమా నుంచి ఆర్ ఆర్ ఆర్ వరకు బిట్ సీన్స్ చూపించారు. మెగా అభిమానులు పండగ చేసుకొనేలా.. ఈ వీడియో సాంగ్ ని డిజైన్ చేశారు.