Live : రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్

మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. రేపు (మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజు. అయితే నెల క్రితం నుంచే చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలైపోయాయ్. తాజాగా అవి పీక్స్ చేరాయి. ప్రస్తుతం హైదరాబాద్ శిల్పాకళా వేదికలో రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయ్. మెగా అభిమానులతో వేదిక కిక్కిరిసిపోయింది. 

ఈ వేదికగా ఆర్ ఆర్ ఆర్ నుంచి అల్లూరి సీతారామరాజు (చరణ్) కొత్త పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు.. బర్త్ డే కానుకగా అభిమానులు చరణ్ గుడ్ న్యూసులు చెప్పనున్నారు. బర్త్ డే స్పీచ్ తో అభిమానులని ఖుషి చేయనున్నారు. మెగా హీరోలు, మెగా ఫ్యామిలీ, మెగా సన్నిహితులు, మిత్రులు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వేదికపై మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. మరి.. కాసేపట్లో మెగా పవర్ వేదిక వద్దకు చేరుకోనుంది.